Pawan kalyan biography in telugu పవన్ కళ్యాణ్ బయోగ్రఫీ ఇన్ తెలుగు
యావత్ తెలుగు ప్రజలందరికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా సుపరిచితమైన వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మెగాస్టార్ నట వారసుడిగా అరంగేట్రం చేసిన పవన్ కళ్యాణ్ అంచెలంచెలుగా తన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్పాటు చేసుకోవడంలో అన్నకు తగ్గ తమ్ముడుగా తనకంటూ తెలుగు పరిశ్రమలో స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. కొణిదెల అంజనాదేవి వెంకట్రావు వెంకట్రావు లకు ఐదవ సంతానంగా పవన్కళ్యాణ్ జన్మించాడు 1968 సెప్టెంబర్ 2 తేదీన జన్మించాడు 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఈ సినిమాతో తెరంగేట్రం చేయడం జరిగింది. ఇవివి సత్యనారాయణ గారు దర్శకత్వం వహించడం జరిగింది సినిమా యావరేజ్ టాక్ సినిమా ఒక మోస్తరుగా ఆడడం జరిగింది. రెండవ సినిమా గోకులంలో సీత ముత్యాల సుబ్బయ్య గారి దర్శకత్వంలో చేయడం జరిగింది ఈ సినిమాకు ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ కు మంచి పేరు వచ్చింది అని చెప్పుకోవచ్చు. 1997 లో నందిని వైజాగ్ అమ్మాయిని వివాహం చేసుకోవడం జరిగింది మూడవ సినిమా భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో సుస్వాగతం చేయడం జరిగింది ఈ సినిమా సూపర్ హిట్ సొంతం చేసుకుంది.
కొత్త దర్శకులను యువ దర్శకులను పరిశ్రమకు పరిచయం చేయడం మొదలుపెట్టాడు
అప్పటి వరకు కో డైరెక్టర్గా పనిచేస్తున్న కరుణాకరన్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ తొలిప్రేమ సినిమా అవకాశం ఇవ్వడం జరిగింది ఈ సినిమా రికార్డులను తిరగరాసింది అని చెప్పుకోవచ్చు అప్పటివరకు చిరంజీవి తమ్ముడు గా పేరున్న పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో తనకంటూ ప్రత్యేక పేరును సంపాదించుకోవడం జరిగింది ఈ సినిమా జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది మరియు అనేక నంది అవార్డులను సొంతం చేసుకోవడం జరిగింది. తనకంటూ సొంత ఫ్యాన్స్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఐదవ సినిమా అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో తమ్ముడు సినిమా చేయడం జరిగింది ఈ సినిమా కూడా సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ అన్నకు తగ్గ తమ్ముడుగా రికార్డులను బ్రేక్ చేశాడు. పవన్ కళ్యాణ్ అంటే అభిమానుల్లో పూనకాలు వచ్చే విధంగా ట్రెండ్ ను సెట్ చేశాడు. అప్పటి వరకుఅవకాశాల కోసం ఎదురు చూస్తున్న పూరి జగన్నాథ్ కు సినిమా బద్రి తో అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు ఈ సినిమాలో తనదైన నటన శైలితో పవన్ కళ్యాణ్ ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాడని చెప్పవచ్చుపూరి జగన్నాథ్ దర్శకత్వం తోపవన్ కళ్యాణ్ ను ఒక కొత్త కోణం లో ప్రేక్షకులకు చూపించాడు. ప్రేక్షకులసినిమాను చేశాడు. ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ కూడా పరిశ్రమలు తిరుగులేని దర్శకుడిగాఎదిగాడు. బద్రి సినిమా ఇటు పరిశ్రమ మరియు పవన్ కళ్యాణ్ పూరి జగన్నాథ్ లకు ఒక గొప్ప సినిమా అని చెప్పుకోవచ్చు.
కొత్త దర్శకులు విభిన్నమైన కథలతో ప్రయోగాలు పవన్ కళ్యాణ్ సొంతం.
పవన్ కళ్యాణ్ కు ఏడవ సినిమా అయినా ఖుషి కి ఎస్.జె.సూర్య దర్శకత్వం వహించారు. ఈ సినిమా రికార్డుల ప్రభంజనం సృష్టించింది అని చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ యొక్క స్టార్ డం ఆకాశాన్ని తాకింది అని చెప్పుకోవచ్చు చిరంజీవి స్టార్డంను ఛాలెంజ్ చేసే విధంగా పవన్ కళ్యాణ్ ఎదిగాడని చెప్పుకోవచ్చు. ఖుషి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ సొంత దర్శకత్వంలో జానీ సినిమా నిర్మాణం జరిగింది అల్లు అరవింద్ గారు నిర్మాత ఈ సినిమా పవన్ కళ్యాణ్ కి చేదు అనుభవాన్ని మిగిల్చింది అని చెప్పుకోవచ్చు మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఈ సినిమా కథ ఉంటుంది. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడం జరిగింది తర్వాత వచ్చిన గుడుంబా శంకర్ బాలు బంగారం అన్నవరం సినిమాలు యావరేజ్ గా ఆడడం జరిగింది ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ రేంజి హిట్స్ కావు అని చెప్పుకోవచ్చు. 2008లో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన జల్సా సినిమా పవన్ కళ్యాణ్ కు కొంత ఊరటనిచ్చింది అని చెప్పుకోవచ్చు ఆ తర్వాత వచ్చిన కొమరం పులి పంజా తీన్మార్ కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలు కూడాఆశించిన విధంగాహిట్ అవలేదు2012లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా కళ్యాణ్ కెరీర్ కు సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చుఈ సినిమా పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఎలా ఉంటుందోబాక్స్ ఆఫీస్ కుమరోసారి రుచి చూపించిందిరికార్డుల వర్షంతో. 2013లో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా అత్యధిక వసూళ్లను సృష్టించిన తెలుగు సినిమాగా రికార్డులకెక్కింది 2017 లో 69 వ స్థానం 2018లో 24 వ స్థానం ఇండియా సెలబ్రిటీస్ లో ఫోర్బ్స్ పత్రిక లోస్థానం సంపాదించుకున్నాడు.
పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం
అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో యూత్ వింగ్ ప్రెసిడెంట్ గా 2008 లో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో అరంగేట్రం చేశాడు. తర్వాత ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ ఆశించిన ఫలితాలను సాధించలేక పోయింది ఆ తర్వాత చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం జరిగింది 2014 మార్చి నెలలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపన చేయడం జరిగింది కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ చారిటీ ని కూడా స్థాపించడం జరిగింది జనసేన పార్టీని స్థాపించిన వెంటనే ఎన్నికల్లో మాత్రం పోటీ చేయలేదు ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించే పనిలో నిమగ్నమయ్యాడు తర్వాత వచ్చిన 2019లో ఎలక్షన్లో పోటీ చేయడం జరిగింది ఆశించిన ఫలితాలను సాధించలేక పోయారు. అయినా సరే ప్రజల తరఫున నిలబడి ప్రజల సమస్యలపై పోరాడుతూనే ఉన్నాడు ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన తర్వాత ఫలితాలు సాధించకపోవడంతో వెంటనే పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన చిరంజీవి లాగా పవన్ కళ్యాణ్ మాత్రం ఆ తప్పు చేయలేదని చెప్పుకోవచ్చు ఫలితాలతో సంబంధం లేకుండా ప్రజల సమస్యలపై ప్రజలతో మమేకమై పోరాడుతూనే ఉన్నాడు.
చంద్రుడిపై మచ్చ లాంటిది పవన్ కళ్యాణ్ వైవాహిక జీవితం
పవన్ కళ్యాణ్ కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడంలో ముందుంటాడు తన సినిమాల వలన ఎవరైనా డిస్ట్రిబ్యూటర్స్ నష్టాలను చవి చూస్తేతన సొంత డబ్బుతో వారి నష్టాలను భర్తీ చేసేవారు కుటుంబ విలువలకు సంస్కృతి సాంప్రదాయాలకు పవన్కళ్యాణ్ చాలా విలువ ఇస్తారుకానీ వైవాహిక జీవితంలో మూడు పెళ్లిళ్లు చేసుకుని విమర్శలను ఎదుర్కొన్నాడు ఇది పవన్ కళ్యాణ్ జీవితంలో ఒక మచ్చ లాంటిదని చెప్పుకోవచ్చు సాధారణంగా పవన్ కళ్యాణ్ ని విమర్శించడానికిపెద్దగా కారణాలుఏవీ కనిపించవు కానీ తన ప్రత్యర్థి పార్టీలకు విమర్శించడానికి తన వైవాహిక జీవితాన్ని టార్గెట్ చేసి విమర్శిస్తారు ఒక వ్యక్తి తన నిజ జీవితంలో లో ఇన్ని పాత్రలు పోషించడం అనేది చాలా అరుదు ఒక ఫైట్ మాస్టర్ డైరెక్టర్ సింగర్ యాక్టర్ రైటర్ ప్రొడ్యూసర్ రాజకీయవేత్తగా అనేక పాత్రలు పోషిస్తున్నాడు.
పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలు
1996 అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి.
1997 గోకులంలో సీత
1998 సుస్వాగతం
1998 తొలిప్రేమ 1999 తమ్ముడు
2000 బద్రి
2001 ఖుషి
2003 జానీ
2004 గుడుంబా శంకర్
2004లో శంకర్ దాదా ఎం బి బి ఎస్ లోగెస్ట్ క్యారెక్టర్ చేయడం జరిగింది
2005లోబాలు
2006లో బంగారం
2006లో అన్నవరం
2007లో శంకర్ దాదా జిందాబాద్ గెస్ట్ క్యారెక్టర్ 2008లో జల్సా
2010లో కొమరం పులి
2011లో పంజా
2011లో తీన్మార్
2012లోకెమెరామెన్ గంగతో రాంబాబు
2012లోగబ్బర్ సింగ్
2013లో అత్తారింటికి దారేది
2015 లో గోపాల గోపాల
2017లో కాటమరాయుడు
2018లో అజ్ఞాతవాసి
2021లో వకీల్ సాబ్
2022 లో భీమ్లా నాయక్
మూడు సినిమాలు ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్నాయి
పవన్ కళ్యాణ్ కు నలుగురు సంతానం ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు.
హిట్ ఫ్లాఫ్ లతో సంబంధంలేకుండా కలెక్షన్ల వర్షం కురిపించే ఏకైక హీరో
పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రత్యేకమైనదని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఖుషి సినిమా తర్వాత ఆశించిన విధంగా చాలా సినిమాలు ఆడలేదు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడం జరిగింది అయినా సరే క్రేజ్ కలెక్షన్లు తగ్గక పోవడం గమనార్హం దాదాపుగా పది సంవత్సరాల వరకు ఇండస్ట్రీ హిట్ లేక పవన్ కళ్యాణ్ సతమతమయ్యారు అయినప్పటికీ కొంత కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గకుండా ఉన్న ఏకైక తెలుగు హీరో అని చెప్పుకోవచ్చు. ఈ క్రెడిట్ అంతా కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి చెందుతుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉన్నప్పటి కంటే ఎక్కువగా ఫెయిల్యూర్స్ లో కూడా తన వెనకాలే ఉన్నారు.
విలువలతో కూడిన జీవన శైలి పవన్కళ్యాణ్ సొంతం
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి